సేవ్ గణపతి !!

గణపయ్యను పూజించే
మూడు లేని తెలుగుజనం !
రోడ్డెక్కిన కుటుంబాలు
ప్రతిరోజూ నిమజ్జనం !!

తెలుగుజాతి అనుబంధం
కాపాడోయ్ గణపతీ !
మనోభావ సమరంలో
ప్రతివాడూ దళపతీ !!

పత్రి లేదు వినాయకుడికి
లేవు కుడుము ఉండ్రాళ్ళు !
దగాకోరు నాయకులకు
జనం చేత బండరాళ్ళు !!

కాలుష్యం వద్దంటూ
నీకు మట్టి విగ్రహాలు !
ఊరూరా మాకిక్కడ
నిత్యం సత్యాగ్రహాలు !!

– ఏవీయస్