సిగ్గూ ఎగ్గూ జాన్తా నై !

తాజాగా బైటపడిన
మరో స్కాము అగస్టా !
ఓ మైగాడ్ అధికారం
మరీ ఇంత వరస్టా !!

అవినీతి తొ మురికిపట్టి
నల్లబడ్డ నా దేశం !
జనం ఖర్మ ఇంతేలే
తొక్కిపట్టు ఆవేశం !!

నిత్యకృత్య మీ గడ్డకు
అగస్టాలు బోఫోర్సులు
ఎందుకయ్య శుద్ధ వేస్టు
ఎంక్వయిరీ ల ఫార్సులు !!

కమీషన్ల కక్కుర్తికి
దేశ పరువు తాకట్టు !
సమర్ధించుకుంటారేం
సిగ్గు శరము లేనట్టు !!

– ఏవీయస్