శ్రీశ్రీశ్రీ చిదంబరానంద !

మన్మోహన బడ్జెట్టని
పొగిడినాడు సింగుగారు !
అంత సోకు ఏముందని
అడుగుతోంది ప్రతినోరు !!

నెప్పి తెలియకుండా మరి
వచ్చును రూపాయి రాక !
చిదంబరం సాగరమిది
సామాన్యుడి జీవనౌక !!

సబ్జెక్టే లేనప్పుడు
ఎందుకులే బడ్జెట్టూ !
కాకి లెఖ్ఖలేసుకుంటె
కాదోయ్ ఇది పర్ఫెక్టూ !!

ఎన్నికలే ప్రాతిపదిక
మాటలన్ని పాలిటిక్సు !
సామాన్యుడి ఆకర్షణ
చేతలన్ని చీపుట్రిక్సు !!

– ఏవీయస్