తెలుగు ఉసురు !

ఉద్యమాల వేడిమితో
రగులుతోంది స్టేటు !
నిన్న తెలంగాణా మరి
నేడు సమైక్యాంధ్ర ఫైటు !!

సొనియమ్మ పాపమంటు
తిట్లు శాపనార్ధాలు !
కాంగిరేసు నాయకులకు
శవయాత్రలు శ్రాద్ధాలు !!

చిన్నలేదు పెద్దలేదు
అందరు సమయోదులే !
రోడ్డెక్కిన తెలుగుజనం
పోరు వృధా పోదులే !!

అన్నదమ్ములే అందరు
ఎందుకు ఈ రసాభాస !
సమన్యాయం చేసినపుడు
వుండదు ఏ జనఘోష !!

– ఏవీయస్