వాపు అలియాస్ బలుపు

సహకారం సక్సెసుతో
ముఖ్యమంత్రి సంతోషం !
వాపు కాదు బలుపంటూ
జనావళికి సందేశం !!

రైతుల మద్దతు తమకని
కిరణ్ గారి ధీమా !
వస్తుందట ఇకమీదట
ఆత్మహత్యలకు కామా !!

ఎన్నికలే పరమార్ధం
కాకూడదు ఓ సీయం !
పొలం బిడ్డ కన్నీరు
కాదయ్యా నీకు జయం !!

జనం చల్లగుంటేనే
రాజకీయ ఫ్యూచరూ !
తేడా వస్తే తప్పదు
అపజయాల టార్చరూ !!

– ఏవీయస్