ఫ్లాష్ న్యూస్ 25-06-2019

* సోమవారం కన్నుమూసిన రాజ్యసభ సభ్యుడు మదన్లాల్ సైని మృతికి సంతాప సూచకంగా రాజ్యసభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే ఛైర్మన్ వెంకయ్యనాయుడు సైని మృతికి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళిగా రాజ్యసభ సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.

* నేను పార్టీ మారుతానంటూ మీడియా మరియు సోషల్ మీడియాలో ప్రసారం చేసుకుంటున్నారు. ఆ వార్తలకు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు, తర్వాత మరియు ఇప్పుడు కథనాలు వచ్చాయి, ఏప్పుడు అలాంటి అసత్య కథనాలు వస్తూనే ఉంటాయి, @JaiTDP పార్టీ మారే ప్రసక్తే లేదు. – Ganta Srinivas Rao

* చంద్రగ్రహణం కారణంగా జూలై 16న తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటలపాటు విరామం ఏర్పడింది. దాదాపు 10 గంటలపాటు ఆలయంలో అన్ని కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి. వాస్తవానికి చంద్రగ్రహణం.. 16వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1.31 గంటల నుంచి 17వ తేదీ తెల్లవారు జామున 4.29 గంటల వరకు కొనసాగుతుంది.

* పాస్పోర్ట్ వివరాల ధ్రువీకరణలో ఏపీ పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2019 పాస్పోర్ట్ సేవా దివస్ లో భాగంగా ఢిల్లీలో విదేశాంగశాఖ ఆధ్వర్యంలో జరిగిన పాస్పోర్ట్ అధికారుల సద స్సులో 2018-19 సంవత్సరానికి గానూ ఏపీ పోలీసు శాఖ అవార్డును అందుకుంది.

* మరుగుదొడ్ల నిర్మాణంలో మంచి పురోగతి సాధించినందుకు ఆంధ్రప్రదేశ్కు స్వచ్ఛ్సుందర్ శౌచాలయ్ అవార్డు లభించింది.అవార్డును నెల్లూరుజిల్లా స్వచ్ఛభారత్ మిషన్ కన్సల్టెంట్ వై.మహేష్ ఢిల్లీలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో కేంద్రజలశక్తిశాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నుంచి అందుకున్నారు.

* ఝార్ఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గర్హ్వా ప్రాంతంలో ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. మరో 39 మందికి తీవ్ర గాయాలయ్యాయి.ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్ నుంచి గర్హ్వాకి వస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాద సమయంలో దాదాపు 50మంది బస్సులో ఉన్నట్లు సమాచారం.

* నేను పార్టీ మారుతానంటూ మీడియా మరియు సోషల్ మీడియాలో ప్రసారం చేసుకుంటున్నారు. ఆ వార్తలకు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు, తర్వాత మరియు ఇప్పుడు కథనాలు వచ్చాయి, ఏప్పుడు అలాంటి అసత్య కథనాలు వస్తూనే ఉంటాయి, @JaiTDP పార్టీ మారే ప్రసక్తే లేదు. – Ganta Srinivas Rao