ఫ్లాష్ న్యూస్ 04-07-2019

* వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్‌సభ నిర్వహిస్తున్నారు. లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైన ఆయన ఆధార్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభకు అధ్యక్షత వహిస్తున్నారు.

* ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్‌ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌.డి.సి) చైర్మ‌న్‌గా న‌టుడు, నిర్మాత‌, శ్రీవిద్యానికేత‌న్ సంస్థ‌ల అధినేత డా.మంచు మోహ‌న్‌బాబుగారిని నియ‌మించార‌ని సోష‌ల్ మీడియాలో కొన్నిచోట్ల వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆ వార్త‌ల్లో నిజం లేదు. – మోహ‌న్‌బాబు పి.ఆర్ టీమ్‌

* వెస్టిండీస్‌ విధ్వంసక ఆటగాడు, యూనివర్స్‌ బాస్ క్రిస్‌గేల్‌ గురువారం తన ఆఖరి ప్రపంచకప్‌ మ్యాచ్‌ ఆడబోతున్నాడు. 40 ఏళ్ల గేల్ తదుపరి ప్రపంచకప్ ఆడే అవకాశం లేకపోవడంతో ఈ రోజు అఫ్గానిస్థాన్‌తో ఆడేదే అతడి చివరి ప్రపంచకప్‌ మ్యాచ్‌ కానుంది.

* ఉత్తర కశ్మీర్‌లో 14,000 అడుగుల ఎత్తున సాగే అమర్‌నాథ్‌ యాత్రకు భక్తులు తరలి వస్తున్నారు. పవిత్ర గుహ వద్ద సందడి నెలకొంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా మంచు పేరుకుని ఉండడంతో పవిత్ర గుహకు చేరుకోవడానికి, దర్శనం అనంతరం తిరిగి రావడానికి యాత్రికులకు భద్రతా బలగాలు చేయూతనందిస్తున్నాయి.

* నేటి నుంచి ‘తానా’ 22వ మహాసభలు. జులై 6 వరకూ నిర్వహణ. మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు. వేదిక కానున్న వాషింగ్టన్‌ డీసీ

* కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ గుడ్‌బై చెప్పడంపై ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పందించారు. ‘ఇటువంటి నిర్ణయం తీసుకునే ధైర్యం కొద్దిమందికే ఉంటుంది. నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను’ అని అన్నారు.

* ప్రజాదర్బార్‌ కోసం ప్రత్యేక భద్రత. తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద డ్రోన్లతో నిఘా

* తెలంగాణ వ్యాప్తంగా బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు.రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ఈ బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నారు.తెలంగాణలో ఆషాఢం, శ్రావణ మాసాల్లో బోనాల జాతర జరుపుతారు.

* జగన్నాథుడి వార్షిక రథయాత్ర గురువారం ఘనంగా ప్రారంభమైంది.కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా, ఆయన భార్య సోనాల్‌ షా,గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. మంగళహారతి కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ రథయాత్ర శ్రీ గుండీచా ఆలయం వద్ద పరిసమాప్తం కానుంది.