ఫ్లాష్ న్యూస్ 01-07-2019

సతీశ్‌ధవన్‌ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా రాజరాజన్‌ ఆర్ముగం బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్నS.పాండియన్‌ పదవీకాలం ముగిసింది.త్రివేండ్రంలోని డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజరాజన్‌ను పదోన్నతిపై డైరెక్టర్‌గా నియమిస్తూ ఇస్రోచైర్మన్‌ శివన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

* తితిదే తిరుమల జేఈవో శ్రీనివాసరాజును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా ఉన్న బసంత్‌కుమార్‌కు తితిదే జేఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

* దేశంలోని తీరభద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని కేంద్రరక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సూచించారు.తీరరక్షణకు సంబంధించి ‘ESB’విధానాల అమలులో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.విశాఖపట్నం తూర్పునౌకాదళం సందర్శనకు వచ్చిన ఆయన అధికారులు, ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.

* ముంబయి నుంచి పుణె వెళుతున్న గూడ్స్‌ రైలు సోమవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే 10 రైళ్లను రద్దు చేశారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు.

* గుంటూరుజిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేటలోని జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీని బొలేరా వాహనం బలంగా ఢీకొట్టింది.ఈప్రమాదంలో 5గురు మృతిచెందారు. మరో 6గురికి తీవ్రగాయాలయ్యాయి.మృతులు పాలకొల్లు వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

* గ్యాస్‌ వినియోగదారులకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) శుభవార్త చెప్పింది. సబ్సిడీలేని గృహ వినియోగ LPGసిలిండర్‌ ధరను రూ.100.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.ప్రస్తుతం సబ్సిడీలేని LPG ధర రూ.737.50గా ఉంది.అది రూ.637కు తగ్గనుంది.ఇక సబ్సిడీ LPG ధర రూ.494.35గా ఐవోసీ నిర్ణయించింది.

* ముంబయిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత శుక్రవారం నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రంతా ముంబయి, శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉండటంతో ప్రధాన రహదారులు,లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

* జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో కేశ్వాన్‌ నుంచి కిష్త్వార్‌ వెళ్తున్న వెళ్తున్న బస్సు లోయలో పడి 31 మంది ప్రాణాలు కోల్పోగా మరో 13 మంది తీవ్రంగా గాయపడి నట్లు సీనియర్‌ పోలీసు అధికారులు తెలిపారు.