బిగ్ బాస్ విజేత ను ఎవరు ప్రకటించబోతున్నారో తెలుసా..?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి మరో వారం లో శుభం కార్డు పడనుంది..దీంతో టైటిల్ ఎవరు కైవసం చేసుకుంటారో అనే ఆత్రుత ప్రేక్షకుల్లో ఎక్కువ అవుతుంది. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి శివజ్యోతి బయటకు వెళ్ళింది. ఇక హౌస్ లో ఉన్న 5 గురిలలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. ఇక ఈ సీజన్ 3 విన్నర్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.

నాగార్జున రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవిని ఫైనల్ ఎపిసోడ్ కు హాజరుకావాలని కోరారట. నాగ్.. చిరు ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో చిరు కూడా వెంటనే నాగ్ ఆహ్వానాన్ని మన్నించి ఈ ఎపిసోడ్ కు హాజరయ్యేందుకు ఒప్పుకున్నారట. సో.. ఈ సీజన్ లో చివరిదశలో ఉండే ఫైనలిస్టుల నుండి విజేతను స్టేజిపై చిరంజీవి ప్రకటిస్తారు. గత సీజన్ లో వెంకటేష్ ఫైనల్ ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా హాజరై కౌశల్ మందా పేరును విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.