పునర్నవిని చూడగానే రాహుల్ ఏం చేసాడో తెలుసా..?

బిగ్ బాస్ సీజన్ 3 ముగింపుకు వచ్చింది. విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌లందరూ హౌజ్‌లోకి గెస్ట్‌లుగా ఎంట్రీ ఇచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ అందరిలో పునర్నవి ఎంట్రీ హైలైట్‌గా నిలిచిపోయింది. ఇంట్లోకి పునర్నవి రాగానే శ్రీముఖి.. పున్నును అరుస్తూ.. ఒక్కసారిగా ఎత్తుకొని తిప్పేసి.. రాహుల్ దగ్గరకి తీసుకువచ్చింది. రాహుల్ దగ్గరకు వచ్చిన పున్నును రెండు చేతులతో ఎత్తుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి హౌజ్‌లోని గార్డెన్ ఏరియాలో కూర్చోని మాట్లాడుకున్నారు.

రాహుల్.. పున్నుతో ‘‘ బయట ఏమనుకుంటున్నారు’’ అనగా… ‘‘ఈ రెండు వారాల్లో నీకు కొత్త బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు కదా అంటూ… నేను ఏం చెప్పినా ఫేక్‌గానే అనిపిస్తది నీకు. ఎందుకంటే నేను నీ ట్రూ బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా’’ అంది పున్ను. దీంతో అదేం లేదని రాహుల్ అంటుంటే.. పునర్నవి అడ్డు పడి.. ‘‘ఈ మధ్య చాలా ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నావ్’’ గా అంటూ మరో కౌంటర్ ఇచ్చింది. దీంతో రాహుల్ ‘‘నీతో తిరిగి తిరిగి ఇంగ్లీష్ వచ్చుంటుంది’’ అని సెటైర్ వేశాడు. మొత్తం మీద హౌస్ సభ్యుల ఎంట్రీ తో షో సరదాగా సాగింది.