బిగ్ బాస్ సీజన్ 2 మొదలైనప్పటి నుండి కౌశల్ పేరు సోషల్ మీడియా లో మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఇంటి సభ్యులంతా ఒకటై, కౌశల్ ను మాత్రం వేరుగా చూడడం తో షో చూస్తున్న వారిలో కౌశల్ కంటూ ఓ ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఇక ఆ అభిమానమే ఇప్పుడు కౌశల్ ఆర్మీ పేరిట ఓ సునామి అయ్యింది. మొన్నటి వరకు కేవలం సోషల్ మీడియా లో మాత్రమే కౌశల్ కు సపోర్ట్ చేస్తున్న వచ్చిన వీరంతా ఇటీవల హైదరాబాద్ నగరం లో కౌశల్ ఆర్మీ పేరిట 2 కే రన్ నిర్వహించి కౌశల్ ఆర్మీ పవర్ ఎలా ఉందొ అందరికి చూపించారు.
ఇక తాజాగా కౌశల్ ఆర్మీ ఫై సినీ విమర్శకుడు కత్తి మహేష్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ‘అభిమానం ఉండొచ్చు కానీ, దురాభిమానం ఉండకూడదు. బిగ్‌బాస్‌కు వచ్చిన తర్వాత ఇంట్లోవారిలా మెలిగాల్సి ఉంటుంది. హౌస్‌మేట్స్‌లో కొందరు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. అయితే, నచ్చనవారిపై విమర్శలు చేస్తూ ఉన్మాద స్థాయికి చేరుకోవడం మంచిది కాదు. కౌశల్ ఆర్మీ హేయమైన పదజాలంతో విమర్శించడం, బెదిరింపులు చేయడం మంచిది కాదు. కౌశల్‌కే కాకుండా, మిగతా వాళ్లకు కుటుంబాలు ఉంటాయి. అలాంటి ట్రోలింగ్లు వారిని బాధిస్తాయి’’ అని తెలిపారు.
‘‘కౌశల్ ఆర్మీ అనే పదంలోనే హింస కనిపిస్తోంది. వీరు ఎవరికి సైన్యం? ఎవరి కోసం సైన్యం? అనేది అర్థం కావడం లేదు. ఏవరీ కౌశల్. బహుశా ఆయన కొందరికి నచ్చి ఉండచ్చు. నాకు నచ్చలేదు. అలాగని ట్రోల్ చేస్తారా? ఇటీవల ఆయన పేరు మీద టూకే రన్ కూడా చేశారు. కేరళ వరదలు కోసం అలాంటివి చేసి ఉంటే సమాజానికి మంచి సంకేతాలు అందేవి’’ అని కత్తి మహేష్ అన్నారు.
మరి మహేష్ వాఖ్యల ఫై కౌశల్ ఆర్మీ ఎలా సమాధానం చెపుతారో చూడాలి.