బిగ్ బాస్ షో ఫై సంచలన కామెంట్స్ చేసిన మహేష్..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 తుది దశకు చేరుకుంది. రెండు వారాల్లో షో విన్నర్ ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో ఈ షో ఫై సంచలన కామెంట్స్ చేసాడు మహేష్. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమేట్ అయినా మహేష్..బిగ్ బాస్ నిర్వాహకులు కొందరి పట్ల పక్షపాతంగా ఉంటున్నారని అన్నారు.

యాంకర్ శ్రీముఖికి పరోక్షంగా ఫేవర్ చేస్తూ ఆమె హౌస్ లో కొనసాగేలా సహాయం చేస్తున్నారంటూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఆమె టైటిల్ గెలిచినా ఆశ్చర్యం లేదు అని ఆయన చెప్పడం విశేషం. గతంలో కూడా శ్రీముఖి పై కొందరు ఇలాంటి ఆరోపణలే చేయడం తో..ఇప్పుడు మహేష్ కూడా అలాంటి ఆరోపణలే చేయడం తో వీరు చెప్పేది నిజమే కావొచ్చని మాట్లాడుకుంటున్నారు.