హౌస్ మేట్స్ తో శివజ్యోతి దీపావళి సంబరాలు..

బిగ్ బాస్ సీజన్ 3 లో ఎంట్రీ ఇచ్చిన శివజ్యోతి..గత వారం ఎలిమినేషన్ లో ఎలిమెంట్ అయి హౌస్ నుండి బయటకు వచ్చింది. ఇక దీపావళి సంబరాలను తన హౌస్ మేట్స్ తో ఎంతో సంబరంగా జరుపుకుంది. తన కన్నా ముందే ఎలిమినేట్‌ అయిన రవికృష్ణ, అషూ రెడ్డి, రోహిణి, హిమజలను శివజ్యోతి కలుసుకుంది. వారితో కలిసి సరదాగా దీపావళి వేడుకలను జరుపుకుంది. ఈ మేరకు వాళ్లంతా కలిసి టపాకాయలు పేల్చుతున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ఈ వీడియోలో శివజ్యోతి.. స్నేహితులతో కలిసి పీకల్లోతు సంబరాల్లో మునిగిపోయింది.