మీరేం బాధపడకండి అంటున్న పాతాల గంగా ..

తీన్మార్ వార్తలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి..బిగ్ బాస్ సీజన్ 3 లో సభ్యురాలిగా హౌస్ లోకి వెళ్లింది. దాదాపు 14 వారాలపాటు హౌస్ లో గడిపింది. రీసెంట్ గా బయటకు వచ్చిన ఈమె..పలు ఇంటర్వ్యూ లు ఇస్తూ తన సంతృప్తిని వ్యక్త పరుస్తుంది.

తనను ఇంత దూరం తీసుకు వచ్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. విన్నర్ కాలేక పోయాను అనే బాధ నాకేం లేదు. నాకు ఇంత కాలం సపోర్ట్ చేసిన మీరు కూడా బాధ పడకండి. విన్నర్ ఒక్కరే ఉంటారు కదా. నా జర్నీ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను. మీ ఈ అభిమానంను ముందు ముందు కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను అంటూ శివజ్యోతి కోరింది. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొదట్లోనే ఈమెకు పాతాళ గంగ అని పేరు వచ్చింది. ప్రతి చిన్న విషయానికి కూడా బాగా ఎమోషనల్ అయి ఏడ్చేది..దీంతో నెటిజన్లు ఈమెకు ఆ పేరు పెట్టారు.