బిగ్ బాస్ 3 : శివజ్యోతి అవుట్ ?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి మరో వారం లో శుభం కార్డు పడనుంది..దీంతో టైటిల్ ఎవరు కైవసం చేసుకుంటారో అనే ఆత్రుత ప్రేక్షకుల్లో ఎక్కువ అవుతుంది. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేది అలీ అని తెలుస్తుంది. ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో శ్రీముఖి, శివ‌జ్యోతి, అలీ, వ‌రుణ్ సందేశ్ ఉన్నారు. ఇప్ప‌టికే రాహుల్ టూ ఫినాలేకి వెళ్ళగా, గ‌త రాత్రి బాబా భాస్క‌ర్‌ టిక్కెట్ టూ ఫినాలే ఛాన్స్ ద‌క్కించుకున్నార‌ని బిగ్ బాస్ తెలిపారు.

ఇక ఈ వారం శివజ్యోతికి అతి తక్కువ ఓట్లతో ఈవారం ఎలిమినేట్ కావడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే రాహుల్ ఇప్పటికే ఫైనల్‌కి చేరుకోవడంతో పాటు ఈవారం నామినేషన్స్‌లో లేకపోవడంతో ఈ ఓటింగ్ వార్ నుండి తప్పించుకున్నాడు. మొత్తంగా ఫైనల్‌కి వెళ్లే టాప్ 5 కంటెస్టెంట్స్ రాహుల్, బాబా, శ్రీముఖి, వరుణ్, అలీలు అంటూ సోషల్ మీడియా పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.