బిగ్ బాస్ 3 : రాహుల్ కు వైసీపీ సపోర్ట్ ..?

బిగ్ బాస్ సీజన్ 3 కి ఈరోజు తో ఎండ్ కార్డు పడబోతోంది. ఫైనల్ లో ఐదుగురు సభ్యులు ఉండడం తో ఫైనల్ విన్నర్ ఎవరు అవుతారో అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ప్రస్తుతం ఉన్న ఐదుగురిలో ఎక్కువ ఓట్లు శ్రీముఖి , రాహుల్ లకు పడ్డాయి. శ్రీముఖి కోసం బుల్లితెర ప్రముఖలంత ఏకం కాగా..రాహుల్ కోసం సింగర్స్ తో పాటు వైసీపీ పార్టీ అభిమానులు కూడా ఓట్లు వేసినట్లు తెలుస్తుంది. వైసీపీ కి రాహుల్ కు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా..

రాహుల్ సిప్లిగంజ్..ఎన్నికలకుముందు జగన్‌ ఇమేజ్‌ను హైలెట్ చేస్తూ అదిరిపోయే రేంజ్‌లో పాట పాడాడు. ఆ సాంగ్ జగన్ ఫ్యాన్స్‌ను భీభత్సంగా ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడు రాహుల్‌కి జగన్ ఫ్యాన్స్ అంతా గంపగుత్తగా ఓట్లు వేశారంట. దీంతో సీఎం జగన్ సపోర్ట్‌తో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ని ముద్దాడటం ఖాయమని ఆయన ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. మరి కొన్ని గంటల్లో ఈ టైటిల్ ఎవరికీ వస్తుందనేది తెలిసిపోతుంది.