ఫ్లాష్ న్యూస్ 26-06-2019

* అక్రమ కట్టడాలతో నదీ గర్భం కలుషితమవుతోంది. కరకట్టపై అక్రమ కట్టడాలన్నీ కూల్చివేయాలి. కరకట్టపై చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమే. ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా చంద్రబాబు ఖాళీ చేయడం మంచిది. మిగిలిన వాళ్లు కూడా తమకు తాముగా ఖాళీ చేయాలి. – ఆళ్ళ రామకృష్ణారెడ్డి

* ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. జూలై 11వ తేదీ నుంచి పదిహేను రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో 12వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.

* చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకే ప్రజా వేదికను నిర్మించారు. చట్టాలంటే చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదు. అందుకే జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిబంధనల పట్ల ముఖ్యమంత్రిగా ఏనాడు చంద్రబాబు చిత్తశుద్దితో వ్యవహరించలేదు – పేర్ని నాని

* భారతీయ తీర రక్షక దళం డైరెక్టర్ జనరల్(డీజీ)గా తమిళనాడుకు చెందిన కె.నటరాజన్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆ పదవిలో ఉన్న రాజేంద్రసింగ్ పదవీ విరమణ కానున్న సందర్భంగా కొత్త డీజీగా నటరాజన్ జులై ఒకటి నుంచి కొనసాగుతారని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

* వచ్చే నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. 11వ తేదీ దశమి మంచి రోజు కావడంతో ఆ రోజు సమావేశాలను ప్రారంభించాలని, 12న జగన్ ప్రభుత్వం తొలిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

* కడప- నెల్లూరు జిల్లాల పరిధిలో ప్రారంభించిన ఓబులవారిపల్లె-వెంకటాచలం రైలు మార్గంలో విద్యుత్తు గూడ్సు రైలు పరుగులు తీసింది. సరకుతో మొదటిసారి గూడ్సు రైలు తోరణగల్లుకు వెళ్లింది.విద్యుత్తు ఇంజిన్లతో సరకురవాణా రైళ్లను నడపటం మైలురాయిగా నిలిచిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు.

* గతేడాది డిసెంబరు ఆఖరుకు పోలీసు శాఖలో 13,059 ఖాళీలు ఉన్నాయని.. వీటిని భర్తీ చేసి వ్యవస్థను బలోపేతం చేస్తామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. కేంద్రం అదనంగా మంజూరు చేసిన నాలుగు బెటాలియన్ల ఏర్పాటులో భాగంగా 4వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.

* రుతుపవనాలు జోరందుకున్నాయి. రావటం ఆలస్యమైనా వర్షాలు మాత్రం బాగానే కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. *కర్నూలులో కొట్టుకుపోయిన కల్వర్టు *ఆంధ్ర-కర్ణాటక రాకపోకలు బంద్ *నల్లమలలో పొంగుతున్న వాగులు *తిరుమలలో అర్ధరాత్రి కుండపోత *బెజవాడలో ఓ మోస్తరు వర్షం