ఫ్లాష్ న్యూస్ 11-07-2018 at 01:00 PM

* శ్రీసిటీ లో మరో భారీ జపాన్ పరిశ్రమకు శంకుస్థాపన , టోర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి శంకుస్థాపన చేసిన మంత్రి అమరనాథ్ రెడ్డి . శ్రీసిటీ లో 110 ఎకరాల్లో 1000 కోట్ల పెట్టుబడితో నిర్మాణం కానున్న 2 ఉత్పత్తి కేంద్రాలు .

* ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపి కి మొదటి స్థానం రావడం చంద్రబాబు ఘనతే , త్వరలో 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి , సి.ఎం కృషి ఫలితంగానే ఏపి కి పరిశ్రమలు వస్తున్నాయి – మంత్రి కోళ్లు రవీంద్ర

* తూర్పు గోదావరి జిల్లా విలీన మండలాలకు ముంపు హెచ్చరికలు , ఉదృతంగా ప్రవహిస్తున్న శబరీ, గోదావరి నదులు – అప్రమత్తమైన అధికారులు . వీ ఆర్ పురం, ఎటపాక , చింతూరు మండలాల్లో నదీ సమీప గ్రామాల్లో లాంచీలు ఏర్పాటు, ఒక్కో మండలానికి రెండు లాంచీలు ఏర్పాటు . భద్రాచలంలో 30 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం, 40 అడుగులు దాటితే జల దిగ్బంధం కానున్న విలీన మండలాలు.

* నరసారావుపేటలో దివ్యంగా బాలబాలికలకు స్కూల్ యూనిఫారంలు పంపిణి చేసిన స్పీకర్ కోడెల శివ ప్రసాద్. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుంది. దివ్యాంగులలో దాగి ఉన్న ప్రతిభని టీచర్లు గుర్తించి ప్రోత్సహించాలి : స్పీకర్ కోడెల శివ ప్రసాద్