ఫ్లాష్ న్యూస్ 12-07-2018 at 11:00 AM

* నేడు అర్టీఐ కమీషనర్ ల నియామకం పై సి.ఎం చంద్రబాబు ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ సమావేశం. త్రిసభ్య కమిటీలో చంద్రబాబు, జగన్, యనమల సభ్యులు. పలుమార్లు జరిగిన భేటీకి గైర్హాజరైన జగన్ . అర్టీఐ కమీషనర్ ల నియామకం ఆలస్యం పై హైకోర్టు ఆగ్రహం. అర్టీఐ కమీషనర్ ల కోసం సుమారు 312 మంది ధరకాస్తులు . నేడు అర్టీఐ కమీషనర్ ల నియామకం దాదాపు ఖరారు చేసే అవకాశం .

* ఈ నెల 14 న నూజివీడి ఐఐఐటీ వద్ద వనమహోత్సవం , వనమహోత్సవానికి హాజరుకానున్న చంద్రబాబు. సి.ఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శిద్ధా , అటవీశాఖ అధికారులు .

* చిలకలూరిపేట గడియారం స్థంభం వద్ద అన్న కాంటీన్ ప్రారంభం – అన్న కాంటీన్ ను ప్రారంభించిన మంత్రి పత్తిపాటి పుల్లారావు. ప్రతి పేదవాడి కడుపు నిండేందుకే అన్న కాంటీన్లు . అన్న కాంటీన్ల నిర్వహణకు ప్రభుత్వం 200 కోట్లకు పైగా వెచ్చిస్తుంది. అన్న కాంటీన్లకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది, ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాలో ప్రజలకు బీజేపీ సమాధానం చెప్పాలి : మంత్రి పత్తిపాటి పుల్లారావు

* పోలవరం ప్రాజెక్ట్ వాస్తవాలను గడ్కరీ కళ్లారా చూసారు, పేపర్లపై చూడటం వేరు , ప్రత్యక్షంగా చూడటం వేరు . రాష్ట్ర ప్రభుత్వ నిజాయితీ గడ్కరీ కి కనిపించింది. ఇతర మంత్రులు కూడా పోలవరాన్ని సందర్శించాలి :
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

* గడ్కరీ కితాబుతోనైనా ప్రతిపక్షనేతలు నోరు మూసుకోవాలి : టీడీపీ ఎంపీ కేశినేని నాని

* తుంగభద్రకు కొనసాగుతున్న వరద – ఇన్ ఫ్లో 49 ,౭౦౦, అవుట్ ఫ్లో 160 క్యూసెక్కులు . ప్రస్తుత నీటి నిల్వ 54 .341 టీఎంసీ లు . శ్రీశైలం డాం ప్రస్తుత నీటి మట్టం 800 . 20 అడుగులు, పూర్తి స్థలి నీటి మట్టం 885 అడుగులు .

* శ్రీశైలంలో శివసదన్ వద్ద మహబూబ్ నగర్ కు చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం. పురుగుల మందు తాగిన శాఖపూర్ కి చెందిన నాగ రత్నమ్మ, సున్నిపెంటలోని ఆసుపత్రికి తరలింపు.