ఫ్లాష్ న్యూస్ 13-07-2018 at 10:30 AM

* కాసేపట్లో అమరావతి ప్రజావేదిక హాల్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. వ్యవసాయ రుణప్రణాళికలను ఆవిష్కరించనున్న చంద్రబాబు .

* నేడు హైదరాబాద్ రానున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, బేగంపేటలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడనున్న అమిత్ షా.

* నేడు విశాఖ లో చంద్రబాబు పర్యటన – మేజర్ పోర్ట్ చైర్మన్ల సమీక్షా సమావేశంలో పాల్గొననున్న సి.ఎం – విశాఖ పర్యటనలో ఉన్న గడ్కరీ ని కలవనున్న చంద్రబాబు.

* గుంటూరు కలక్టరేట్ వద్ద టీడీపీ ఏమ్మేల్యే రావెల కిశోరె బాబు దీక్ష .ఏస్సీ, ఏస్టీ చట్టాన్ని పరిరక్షించాలని కోరుతూ కిశోరె బాబు దీక్ష .

* నేడు ఉదయం 11 : 30 గంటలకు రాహుల్ తో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ . నేడు రాహుల్ సమక్షంలో కాంగ్రేసులో చేరనున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.

* నేడు సిఐడి కస్టడీకి శ్రీ చైతన్య డీన్ వాసుబాబు – సిఐడి కస్టడీకి శ్రీ చైతన్య, నారాయణ కాలేజీల మధ్యవర్తి శివన్నారాయణ , నేటినుండి ఆరు రోజులపాటు సిఐడి విచారణ .

* జి. మాడుగుల మండలం చేపల్లిలో కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం – కుటుంబ కలహాలతో కుమార్తెతో పాటు బావిలో దూకిన తల్లి కిముడు దేవి , బావిలో తేలిన పాప మృతదేహం , తల్లి కిముడు దేవి కోసం గాలింపు .