ఫ్లాష్ న్యూస్ 13-07-2018 at 11:30 AM

* అమరావతి ప్రజావేదిక హాల్ లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం – రాష్ట్ర వాషిక రుణ ప్రణాళిక (2018 – 19 ) విడుదలచేసిన సీఎం చంద్రబాబు. 1,94,220 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక, ప్రాధాన్య రంగాలకు 44,220 కోట్లు. గతేడాదితో పోలిస్తే ప్రాధాన్య రంగాలకు 19.11 % పెంపు. వ్యవసాయ రంగానికి 1,01,564 కోట్లు కేటాయింపు.

* ప్రేమపేరిట మోసం – కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారం. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించిన యువకుడు. గత రెండు నెలలుగా మొకం చాటేస్తున్న యువకుడు, కొత్తపేట పోలీసులకు పిర్యాదు చేసిన బాధితురాలు .

* చుండూరు మండలం కె ఎన్ పల్లిలో భారీగా గంజాయి పట్టివేత – వాహనాల తనికీల్లో సుమారు 50 లక్షల విలువైన 240 కిలోల గంజాయి పట్టివేత.

* విజయవాడ గ్రే హౌండ్స్ లో నకిలీ డీఎస్పీ – డీఎస్పీ అని చెప్పి భూ వివాదంలో 1.40 కోట్లు వాసులు చేసిన శ్రీహర్ష. పొలిసు జీపులో వెళ్లి ప్లాస్టిక్ తుపాకీతో రియల్ ఎస్టేట్ వ్యాపారికి బెదిరింపులు, శ్రీహర్ష పై అనుమానం రావడంతో పోలీసులకు పిర్యాదు చేసిన బాధితుడు. పోలీసుల అదుపులో నకిలీ డీఎస్పీ, అతని స్నేహితుడు.