ఫ్లాష్ న్యూస్ 14-07-2018 at 11:30 AM

పశ్చిమ గోదావరి : పెరవలి పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్ర్రారంబించిన మంత్రి చిన రాజప్ప – పోలీస్ స్టేషన్ లో వివిధ భాగాలను ప్రారంభించిన మంత్రులు పితాని , జవహర్ . వనం మనం లో భాగంగా పెరవలి స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటిన మంత్రులు .

అనంతపురం : తాడిపత్రిలో భారీగా పోలీసుల మోహరింపు , గరుడాయి ఉక్కు కర్మాగారం ముట్టడికి వైసిపి, వామపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసుల మోహరింపు.

తిరుపతి : బుల్లితెర నటుడు హరిబాబు కోసం టాస్క్ ఫోర్స్ వేట , ఎర్ర చందనం అక్రమ రవాణాలో హరిబాబుకు సంబంధాలు. ఇటీవల విడుదలైన ఓ సినిమాలో నటించిన హరిబాబు . హరిబాబు కోసం మూడు పోలీస్ బృందాలు గాలింపు .

చిత్తూర్ : రేణిగుంట పోలీస్ స్టేషన్ బాత్రూం లో యాసిడ్ తాగి నిందితుడు ఆత్మహత్య , తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున హాజీ అలీ మృతి . ఎర్ర చందనం కేసులో నిన్న సాయంత్రం అరెస్ట్ చేసిన గాజుల మండ్యం పోలీసులు, తిరుపతి కోర్ట్ లో హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా రేణిగుంటలో ఆత్మహత్య .