TV News on 08.11.2012 at 12:45 PM

మహబూబ్ నగర్ : సేరు వెంకటాపురంలో వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన చంద్రబాబు

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది – పేదల పక్షాన నిలబడి టీడీపీ పోరాడుతుంది : చంద్రబాబు

రంగారెడ్డి జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర విజయవంతం అవుతుంది – ఎవరైనా పాదయాత్రకు అడ్డుపడితే బుద్ధిచెబుతాం – తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదని ఎప్పుడో ప్రకటించాం – ఒత్తిడి తేవాల్సింది కాంగ్రెస్ పై ..మాపై కాదు : ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి

సీఎంను కలిసిన ధర్మాన

విధులకు హాజరు కావడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు – తుఫానుతో జరిగిన నష్టంపై సీఎంతో మాట్లాడా – బాధితులను ఆదుకోవడానికి కేంద్రం నుంచి నిధులు తెప్పించాలని కోరా : ధర్మాన

తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూనే ఉన్నాం – తుఫాన్ తీరం దాటాక పరిస్థితిని సరిగా అంచనా వేయలేకపోయాం – అపార నష్టం జరిగింది – విజయవాడ సహా భారత్ లో ఏడు నగరాలు భూకంప జోన్లుగా ఉన్నాయి – భూకంపాలను తట్టుకునే నిర్మాణాలు చేపట్టాలి : మర్రి శశిధర్ రెడ్ది

ఖమ్మం : పాల్వంచ కేటీపీఎస్ లో తడిబొగ్గు కారణంగా తగ్గిన విద్యుదుత్పత్తి – కేటీపీఎస్ 5,6 దశల్లో 350 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం – కేటీపీఎస్9,10,11 యూనిట్లలో విద్యుదత్పత్తిని 650మెగావాట్లకు కుదించిన అధికారులు

ఢిల్లీ : నేడు బీజేపీ సీనియర్ నేత అద్వానీ 86వ జన్మదినం, శుభాకాంక్షలు తెలిపిన గడ్కరీ, పలువురు ప్రముఖులు

పార్టీ కంటే ప్రధాని పదవే చిన్నది – ప్రధాని పదవిపై ఆసక్తి లేదు – పార్టీకి చేయాల్సింది ఇంకా చాలా ఉంది – భాజపా, దేశం నాకు చాలా ఇచ్చింది : ఎల్.కె. అద్వానీ